వెనుక‌బ‌డిన ప్రాంతాల గ్రాంటు విడుద‌ల‌కు స‌హ‌క‌రించండి…నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి CM Revanth విన‌తి

Share the news
CM Revanth

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు. హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌,ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.


See also  Reason behind quality liquor in AP again? మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం..?

Also Read News

Scroll to Top