- All Posts
- Short News

చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు(62)
(Visveswara Rao)ఈరోజు మధ్యాహ్నం (ఏప్రిల్ 2) కన్నుమూశారు. ఆయన తమిళ, తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా
పేరు తెచ్చుకున్నారు. 6 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించిన విశ్వేశ్వరరావు ఇప్పటివరకు
350కి పైగా చిత్రాలతో పాటు TV సీరియల్స్‌లో కూడా నటించాడు. విశ్వేశ్వరరావు భౌతిక కాయాన్ని
చెన్నై సిరుచేరిలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి
-By VVA Prasad

కాటేదాన్: రాజేంద్రనగర్ పరిధి లోని కాటేదాన్లోని రవి ఫుడ్ బిస్కట్ ఫ్యాక్టరీలో
ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.
పరిశ్రమ భవనంలోని మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
-By VVA Prasad

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది.
ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి.
దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
-By VVA Prasad

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP)
ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక
క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు
ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్‌డీఎమ్‌కే నేత దురై వైకో
-By Guduru Ramesh Sr. Journalist

నగదు తరలింపునకు(Cash Transfer) అధికారుల సూచనలు
రూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరి
సీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడి
కమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు తెచ్చుకోవచ్చని వివర
-By Guduru Ramesh Sr. Journalist

రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం బరిలో బైడెన్, ట్రంప్(Trump)
నవంబర్‌లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అధ్యక్ష పోటీకి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాల ఖరారు
జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం
వాషింగ్టన్‌లో ట్రంప్ విక్టరీ, నిక్కీ హేలీ రేసు నుంచి తప్పుకోవడంతో ట్రంప్‌కు మార్గం సుగమం
-By Guduru Ramesh Sr. Journalist

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Molla Mamba) జయంతి సందర్భంగా
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం,
ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ప్రభుత్వ విప్‌లు
వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండేపూడి పురుషోత్తం
-By Guduru Ramesh Sr. Journalist

ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద లోకేశ్(Lokesh) భూమి పూజ
బొప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ సభ
మూడు పార్టీల నాయకులతో కలిసి సభాస్థలి పరిశీలన
సభ ఏర్పాట్లపై వివిధ కమిటీలతో చర్చ
లక్షలాదిమంది తరలివచ్చే సభలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేలా ఏర్పా
-By Guduru Ramesh Sr. Journalist

సచివాలయంలో T-SAFE ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హాజరైన మంత్రులు, అధికారులు.
T-SAFE ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను అందిస్తున్న తెలంగాణ పోలీస్.
అన్ని రకాల మొబైల్ ఫోన్ లకు అనుకూలంగా T-SAFE
-By C.Rambabu

ఈ నెల 17న చిలకలూరిపేట సభ…
జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ(PM Modi) విమానం..!
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు
చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ
హాజరు కానున్న ప్రధాని మోదీ
కొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు
-By Guduru Ramesh Sr. Journalist

మంత్రి రజనిపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకలూరిపేట వైసీపీ(YCP) ఇన్చార్జి రాజేశ్
అధిష్ఠానంపై తిరగబడిన వైసీపీ ఇన్చార్జి
మంత్రి రజని తన నుంచి రూ.6.5 కోట్లు తీసుకుందని ఆరోపణ
సజ్జలకు చెబితే రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి
మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేశ్
సజ్జల "వదిలేయండయ్యా" అన్నారని ఆవేదన
-By Guduru Ramesh Sr. Journalist

పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం…
నోటిఫికేషన్ విడుదల
గతంలో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం-2019
2019లో ప్రతిపక్షాల నిరసనల మధ్యే సీఏఏకి ఆమోదం
నిబంధనలపై స్పష్టత లేకపోవడంపై అమలులో ఇన్నాళ్ల పాటు ఆలస్యం
-By Guduru Ramesh Sr. Journalist

రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ఎంట్రీ..
మహ్మద్ షమీ కోసం బీజేపీ ప్రయత్నాలు
బెంగాల్‌లోని బసిర్‌హట్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం
ఇప్పటికే బెంగాల్ రాజకీయాల్లో మనోజ్ తివారీ, అశోక్ దిండా
-By Guduru Ramesh Sr. Journalist

దేశంలోనే తొలిసారి.. వితంతువులు(Widows) మళ్లీ పెళ్లాడితే రూ. 2 లక్షలు.. ప్రకటించిన ఝార్ఖండ్ ప్రభుత్వం
భర్త మరణం తర్వాత సమాజంలో ఒంటరిగా మారుతున్న మహిళలు
వితంతు పునర్వివాహం పట్ల ఈ పథకం సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని భావన
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం నుంచి మినహాయింపు
పునర్వివాహం తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకుంటే రూ. 2 లక్ష
-By Guduru Ramesh Sr. Journalist

ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు మరియు పవన్
ఇవాళ ఢిల్లీ బీజేపీ పెద్దలని కలవనున్న చంద్రబాబు
ఎన్నికలకు పొత్తులో భాగంగా కీలక మంతనాలు జరపనున్న టీడీపీ అధినేత..
ఢిల్లీకి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా వెళ్లే అవకాశం
-By Guduru Ramesh Sr. Journalist

ముద్రగడ(Mudragada) నివాసానికి వెళ్లనున్న మిథున్ రెడ్డి.. వైసీపీలో చేరనున్న కాపు నేత!
కిర్లంపూడిలో ముద్రగడతో చర్చలు జరపనున్న మిథున్ రెడ్డి
ముద్రగడకు నామినేటెడ్ పదవి ఆఫర్
ఈ నెల 12న వైసీపీలో చేరే అవకాశం
-By Guduru Ramesh Sr. Journalist

జగన్(Jagan) ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విసుర్లు
రాజధానిగా చెప్పుకుంటూ విశాఖ ప్రజలను మూడేళ్లు దగ చేశారన్న షర్మిల
వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారని ధ్వజం
పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అంటూ మండిపాటు
-By Guduru Ramesh Sr. Journalist

కాశీ(Kashi) వెళ్లే భక్తులకు శుభవార్త.
శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం ఆధ్వర్యంలో మరో వసతి గృహం ప్రారంభించారు.
కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు.
శివరాత్రి పర్వదినం నుంచి కైలాస భవన్ బ్లాక్ -ఎ గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయని ట్రస్టీ వేంకట సుందర శాస్త్రి తెలిపారు

మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimoolapu Suresh) కాన్వాయ్‌లో అపశృతి
ఎస్కార్ట్ వాహనం ఆటోని ఢీకొనడంతో ఒకరు మృత్యువాత
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఘటన
మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ప్రమా
-By Guduru Ramesh Sr. Journalist

118 సీట్లతో టీడీపీ జనసేన(TDP and Janasena) తొలి జాబితా
తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల ప్రకటన
మిగిలిన అభ్యర్థుల ను త్వరలో ప్రకటించనున్న టీడీపీ
మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయింపు
పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 24 సీట్లలో 5 సీట్లలో అభ్యర్థులను నేడు ప్రకటించిన జనసేన అధినే
-By Guduru Ramesh Sr. Journalist

ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం
భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ
ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త
ఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన
ఇరు పక్షాల వాదనల అనంతరం భర్తకు అనుకూలంగా ఇండోర్ కోర్టు(Indore Court) తీర్పు
-By Guduru Ramesh Sr. Journalist

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్ క్రికెట్.. లంచ్ వద్ద ENG 112/5
తన తొలి ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు తో పేసర్ ఆకాష్ డీప్ డ్రీమ్ అరంగేట్రం
బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ ని మొదటి సెషన్ ప్రారంభంలో దాదాపుగా ఆడలేకపోయారు
ఇంగ్లాండ్ పై 100 వ వికెట్ తీసిన అశ్విన్
చివరికి ఇంగ్లండ్ తొలి సెషన్‌లో సగం బ్యాటింగ్ లైనప్ కోల్పోయింది

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి(Manohar Joshi) కన్నుమూత
మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు అందించిన మహరాష్ట్ర రాజకీయ దిగ్గజం
టీచర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనం
శుక్రవారం మధ్యాహ్నం ముంబైలో జరగనున్న అంత్యక్రియ
-By Guduru Ramesh Sr. Journalist

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యే
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైన ఆమె
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నంది
-By Guduru Ramesh Sr. Journalist

రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు
రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
పోటీగా ఇతరులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆర్‌వో ప్రకటన
సీఎం జగన్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు
-By Guduru Ramesh Sr. Journalist

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu)
పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు అపహాస్యపు పనులు చేస్తున్నారన్న వెంకయ్య
స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శ
మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని సూచన
-By Guduru Ramesh Sr. Journalist

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)
రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు
ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్
టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం
-By Guduru Ramesh Sr. Journalist

ఢిల్లీ హైకోర్టు(Delhi Hugh Court)కు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్
బల్వంత్ దేశాయ్ పేరుతో బెదిరింపులు
ఢిల్లీలో జరిగే అతి పెద్ద పేలుడు అంటూ వార్నింగ్
హైకోర్టులో పాటు దిగువ కోర్టులకు కూడా భారీ భద్రత
-By Guduru Ramesh Sr. Journalist

'రాజధాని ఫైల్స్'(Rajdhani Files) సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు
ఈరోజు విడుదల కావాల్సి ఉన్న 'రాజధాని ఫైల్స్'
జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా సినిమా ఉందని హైకోర్టులో పిటిషన్
రేపటి వరకు సినిమా విడుదలను ఆపేయాలని హైకోర్టు ఆదేశం
-By Guduru Ramesh Sr. Journalist

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్(IPL) పోటీలు
భారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
అదే సమయంలో ఐపీఎల్ పోటీలు
వివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్
ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి
-By Guduru Ramesh Sr. Journalist

జాతీయ చలనచిత్ర అవార్డుకు ఇందిరాగాంధీ(Indira Gandhi) పేరు తొలగింపు
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కేంద్రం మార్పులు
ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డు
నర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు
ఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు
-By Guduru Ramesh Sr. Journalist

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(Bandla Ganesh) కు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు…
-By Guduru Ramesh Sr. Journalist

మంగళగిరి నుంచి లోకేశ్(Lokesh) ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు: వెల్లంపల్లి శ్రీనివాస్
వైసీపీలో మిగిలిపోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందన్న వెల్లంపల్లి
ఆ స్క్రాప్ ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేశ్ కు వార్నింగ్
మీ నాన్నకే జగన్ భయపడలేదు.. నువ్వెంత అని వ్యాఖ్య
-By Guduru Ramesh Sr. Journalist

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి(Srinivasulu Reddy)
మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ
టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట
ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ
-By Guduru Ramesh Sr. Journalist

Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడీ
నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు
చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు
-By Guduru Ramesh Sr. Journalist

కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani)
జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న అనగాని
మూడు రాజ్యసభ సీట్లలో రెండు రెడ్లకు ఇచ్చారని మండిపాటు
జగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్న
-By Guduru Ramesh Sr. Journalist

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి(Balashowry)
ఏపీలో ఇసుక విధానం(Sand Policy) జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు
గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడి
ఇసుక విధానం ఓ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యలు
-By Guduru Ramesh Sr. Journalist

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి శ్రీను(Kodi Katti Srinu)
జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టిన హైకోర్టు
కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని శ్రీనుకు హైకోర్టు షరతు
-By Guduru Ramesh Sr. Journalist

హైదరాబాద్‌లో దారుణం.. బీజేపీ(BJP) ఎంపీ టికెట్ ఆశావహుడి దారుణహత్య
గతరాత్రి యూసుఫ్‌గూడలో ఘటన
రామన్నపై దాడిచేసి హత్యచేసిన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ చేరిన రామన్న
-By Guduru Ramesh Sr. Journalist

Sharmila districts tour Details
ఈరోజు - సాయంత్రం 5 గంటలకు బాపట్లలో బహిరంగసభ
8వ తేదీ - ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో బహిరంగసభ
9వ తేదీ - ఉదయం 10 గంటలకు కొవ్వూరులో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగసభ
10వ తేదీ - ఉదయం 10 గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు పాడేరులో బహిరంగసభ
11వ తేదీ - సాయంత్రం 5 గంటలకు నగరిలో బహిరంగసభ. నగరిలో నిర్వహించే సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది.

జగన్, చంద్రబాబులకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేయలేదన్న షర్మిల (YS Sharmila)
విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని సూచన
ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి చేయాల్సిన పోరు అని వ్యాఖ్య

రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు(Chandrababu).. బీజేపీ పెద్దలతో భేటీ
ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్న కీలక మలుపు
చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ వెళ్లే అవకాశం
టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచే ఛాన్స్

వాలంటీర్ల(volunteers) కు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు
జీడీ నెల్లూరులో రా.. కదలిరా సభ
హాజరైన చంద్రబాబు
వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరంలేదని వెల్లడి
వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(YCP MP Vijayasai Reddy) పై తెలంగాణలో కేసు
తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి
టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ - వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. 3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్
గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి
15 వేలమందికిపైగా బాధితులు
కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్

కానిస్టేబుల్ ను వాహనంతో గుద్ది చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు(Sandalwood Smugglers)
అన్నమయ్య జిల్లా చీనెపల్లె వద్ద దారుణం
వాహనాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్ ను ఢీకొట్టి, పరారైన స్మగ్లర్లు
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన కానిస్టేబుల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతీఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతీఆయోగ్ వైస్ ఛైర్మన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. హైదరాబాద్‌లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైద్య,ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని నీతీఆయోగ్ వైస్ ఛైర్మన్‌కు ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు.

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు సోమవారం మాసాబ్ ట్యాంక్ సమాచార్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీ అశోక్ రెడ్డి హార్టికల్చర్ డైరెక్టర్ గా బదిలీ పై వెళ్లడంతో ఆయన స్థానంలో కమిషనర్‌గా శ్రీ ఎం హనుమంత రావు నియమితులయ్యారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్ ఆ శాఖ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ప్రచారం చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అందుకు అణుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో I&PR ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎఫ్‌డీసీ కిషోర్‌బాబు, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్లు జగన్, వెంకట్ రమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సీఐఈ రాధాకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మళ్లీ ఏపీలో Quality liquor?
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ ఏపీ ప్రభుత్వం పాత బ్రాండ్ల మద్యం(quality liquor) అందుబాటులోకి వచ్చింది.
మద్యం షాపులు, బార్లలో అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు రావడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.
దీంతో ఎన్నికల సమయంలో వ్యాపారం బాగా జరుగుతుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రోజుకు రూ.75 కోట్ల వ్యాపారం జరుగుతుండగా, పాత బ్రాండ్ల రాకతో రోజుకు మరో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక 'టీఎస్' కాదు… 'టీజీ'
నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం
పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు
తెలంగాణలో కులగణనకు నిర్ణయం

టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2023లో విడుదల
నెంబర్ వన్ గా లండన్
లండన్ లో 10 కి.మీ వెళ్లాలంటే 37 నిమిషాల సమయం
టాప్-10లో బెంగళూరు, పూణే